యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నాడు. గతంలో బిగ్ బాస్ తో మెరిసిన ఈ నందమూరి హీరో ఇప్పుడు జెమినీ టీవీకి ఓ రియాల్టి షో చేయనున్నాడు. త్వరలోనే షో షూటింగ్ మొదలుకానుంది. ఇది కౌన్ బనేగా కరోడ్ పతీ టైప్ లో ఉంటుందన్న చర్చ సాగుతుంది.
ఈ ప్రొగ్రాంలో మొత్తం 60 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఒక్కో ఎపిసోడ్‌కు 30 లక్షల చొప్పున ఎన్టీఆర్ మొత్తం 18 కోట్లు రెమ్యునరేషన్‌గా అందుకోబోతున్నాడని ఫిలింనగర్ లో జోరుగా చర్చ సాగుతుంది. మరోవైపు రెమ్యూనరేషన్ లా కాకుండా… తనే స్వయంగా ఈ షో తీసుకొస్తున్నారని, లాభాల్లో వాటాలే ఉంటాయన్నది మరో టాక్. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ రానుంది.