అల వైకుంఠపురములో సూపర్ సక్సెస్ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ కు మంచి డిమాండ్ ఉంది. ఆ సినిమా పూర్తి చేస్తూనే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా లాక్ చేసుకున్నాడు. అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ కరోనా కారణంగా ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ ఇన్ టైంలో పూర్తి చేయలేకపోతున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని వెయిట్ చేస్తున్నాడు. దీంతో ఈ గ్యాప్ లో సినిమా చేయాలన్న ఉద్దేశంతో మహేష్ బాబుకు కథ వినిపించటం, మహేష్ ఒకే అనటం చకచకా జరిగిపోయాయి.
తాజాగా ఎన్టీఆర్ ఫ్రీ అయ్యేలోపు మహేష్ సినిమా పూర్తిచేస్తానంటు త్రివిక్రమ్ ఎన్టీఆర్ ముందు ప్రపొజల్ పెట్టినట్లు తెలుస్తోంది. కానీ అందుకు ఎన్టీఆర్ గట్టిగానే నో చెప్పినట్లు ఫిలింనగర్ వర్గాలంటున్నాయి. తన కోసం ఈ ఏడాది ఆగాలని, వచ్చే ఫిబ్రవరి వరకు ఆర్.ఆర్.ఆర్ పూర్తి చేసుకుంటామని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక త్రివిక్రమ్ వెనక్కి వచ్చేశారు.
త్రివిక్రమ్ ప్రస్తుతం అయ్యపురం కోష్యిం రీమేక్ కు సంబంధించిన మాటలు, స్క్రిప్ట్ వర్క్ చూస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ నటిస్తుండటంతో అన్నీ తానై చూసుకుంటున్నారు.