నడిరోడ్డు మీద ఉన్నా ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుకుంది. విశాఖపట్నం మధురవాడ మార్కెట్ రోడ్డులో ఉన్నా ఎన్టీఆర్ విగ్రహాన్ని బుధవారం రాత్రి కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అది చూసిన స్థానిక టీడీపీ నాయకులు అవాక్కయ్యారు. వెంటనే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని స్థానికులు చెప్తున్నారు.