మంగమ్మ గారి మనవడు” నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఈ సినిమా ఒక సంచలనం. తమిళ రీమేక్ సినిమా అయినా సరే ఈ సినిమా తెలుగులో సాధించిన విజయం చూసి అక్కడి దర్శక నిర్మాతలు సైతం షాక్ అయ్యారు. తమిళ సినిమా ‘మణ్ వాసనై’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసారు. ఆ సినిమాను తమిళంలో భారతి రాజా డైరెక్ట్ చేసారు. ఇక సినిమా అక్కడ మంచి విజయం సాధించడంతో మరో ఆలోచన లేకుండా ఇక్కడ నందమూరి బాలకృష్ణ హీరోగా తీసుకొచ్చారు. మన తెలుగులో 365 రోజుల పాటు ఆడింది ఈ సినిమా.
Also Read:కాంగ్రెస్ నేతల భిక్షాటన.. రజత్ కుమార్ కు మనియార్డర్
కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ ఈ సినిమాను రీమేక్ చేయాలని భావించినప్పుడు… ఎన్టీఆర్… బాలయ్యకు మూడు కండీషన్ లు పెట్టారు. ఆ కండీషన్ లు పెట్టడానికి ముందు ఒక విషయం తెలుసుకోవాలి. ఈ సినిమాలో మంగమ్మ పాత్రను సీనియర్ నటి భానుమతి చేయాల్సిందిగా ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి అడిగారు. బాలకృష్ణకు కూడా… ఎన్టీఆర్ ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ఈ సినిమా చేయడానికి భానుమతి ఒప్పుకోకపోతే సినిమా వదులుకోవాలని చెప్పారట.
ఇక బాలయ్యకు సినిమా మీద ఆసక్తి ఎక్కువగా ఉండటంతో… ఎన్టీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని ఆమెను చేయాల్సిందిగా కోరారు. అప్పటికే ఆమె తెలుగులో మల్టీ టాలెంటెడ్ సీనియర్ నటిగా గుర్తింపు పొందారు. డైరెక్టర్, నిర్మాత, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు ఇలా ఎన్నో బాధ్యతలు చూస్తున్నారు. అయినా సరే ఈ సినిమా చేయాలని ఎన్టీఆర్ అడిగిన వెంటనే మరో ఆలోచన లేకుండా ఆమె ఓకే చెప్పేశారు. ఇక బాలయ్యకు పెట్టిన కండీషన్ ఏంటి అనేది ఒక్కసారి చూస్తే,
భానుమతి కంటే అరగంట ముందే షూటింగ్ కి బాలకృష్ణ వెళ్ళాల్సి ఉంటుంది. బాలయ్య గురించి ఆమె ఒక్క నిమిషం కూడా ఎదురు చూడకూడదు. భానుమతి సెట్స్ లోకి అడుగు పెట్టిన వెంటనే ఆమె కారు డోర్ బాలయ్య మాత్రమే ఓపెన్ చేయాలి . ఇక కారు దిగిన తర్వాత భానుమతి గారి కాళ్ళకు బాలయ్య నమస్కారం పెట్టాల్సిందే . ఇలా చేస్తేనే ఆ సినిమా చేయాలని ఎన్టీఆర్ కండీషన్ పెట్టడం తో మరో ఆలోచన లేకుండా … బాలయ్య చేయడంతో… భానుమతి పొంగిపోయారట.
Also Read:జెడ్ కేటగిరీ భద్రత అవసరం లేదు.. లోక్ సభలో అసద్..!