అప్పట్లో హీరోలు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు అంటే ప్రాణం పెట్టి మరీ చూసేవారు. అగ్ర హీరోలు అయితే పాత్రకు న్యాయం చేయడానికి అన్ని విధాలుగా కష్టపడేవారు. ఎన్టీఆర్, అక్కినేని వంటి హీరోలు అప్పట్లో కొన్ని పాత్రల కోసం సమయం తీసుకుని కష్టపడేవారు. ఎన్టీఆర్ అయితే పౌరాణిక సినిమాల కోసం చాలా సమయం తీసుకునేవారు. తనకు నచ్చిన విధంగా పాత్ర రావడానికి కాస్త సమయం కేటాయించేవారు.
ఇలా ఒక సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఒక డాన్స్ కోసం నెల రోజులకు పైగా కష్టపడ్డారు ఎన్టీఆర్. ఆ సినిమానే పాండురంగ మహత్యం. ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టారు. హే కృష్ణా.. ముకుందా.. మురారీ అనే పాట కోసం నెలకు పైగా సమయం కేటాయించారు. అప్పట్లో ఒక రకంగా ఇది భారీ బడ్జెట్ సినిమా. సొంత బ్యానర్ లో ఎన్టీఆర్ సోదరుడు సోదరుడు త్రివిక్‌్మరావు నిర్మించారు.
ఒక స్టూడియో లోనే సినిమా షూటింగ్ అంతా జరిగింది. ఆ సమయంలో భారీ సెట్టింగ్ లు వేసి వాటి కోసం భారీగా ఖర్చు చేసారు. సంగీతం.. నాట్యం.. దర్శకత్వం.. లైటింగ్.. ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాల్లో పాటకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఇలాంటి పాటలను తమ సినిమాల్లో పెట్టడానికి ఎక్కువగా కష్టపడ్డారు కొందరు దర్శకులు. కాని ఆ రేంజ్ లో ఏ పాట కూడా హిట్ కాలేదు.