‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుని ఈ రోజు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు. చిన్న వయసులోనే ఎన్టీఆర్ స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ లో కలుపుగోలు తనం, మాటతీరు, మర్యాదకు బుల్లితెర అభిమానులు కూడా ఫిదా అయిపోతారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గతంలో బుల్లితెర షోలోనే తన భార్య లక్ష్మీ ప్రణతి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. లక్ష్మీ ప్రణతిని పెళ్లి చూపుల్లో ఎన్టీఆర్ షాకింగ్ ప్రశ్నలు వేశారట. లక్ష్మీ ప్రణతిని చూసేందుకు వెళ్లినప్పుడు.. ప్రణతి మాత్రం పెళ్లి చూపుల్లో తలెత్తి ఎన్టీఆర్ ను చూడలేదంట.
ఆ తర్వాత ఆమెతో మాట్లాడినప్పుడు ఈ పెళ్లి అంటే ఇష్టమేనా అని అడిగాడట. అందుకు ప్రణతి ఏం సమాధానం చెప్పలేదట. ఇక ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లికి మధ్యలో 8 నెలల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో కూడా ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని ఎన్నో ప్రశ్నలు వేసేవాడట. ఏ ప్రశ్న వేసినా కూడా లక్ష్మీ ప్రణతి మాత్రం నో అనే ఆన్సర్ చెప్పేదట.
అప్పుడు కానీ ఎన్టీఆర్ కు అర్థం కాలేదట. అడవాళ్ల మనసులో ఏం ఉందో తెలుసుకోవడం కష్టం అని. అది తెలిసిన వాడు ప్రపంచాన్నే ఏలుతాడని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ – ప్రణతి దంపతులకు భార్గవ్ రామ్, అభయ్ రామ్ ఇద్దరు కుమారులు ఉన్నారు.
Also Read: కీరవాణి తండ్రికి అన్ని ఆస్తులు ఉండేవా?