లక్ష్మీ పార్వతి కనిపించడం లేదు, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ.. సమయం వచ్చినప్పుడల్లా టీడీపీ ని ఉతికారెసిన లక్ష్మీ పార్వతి కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్నారు. వైసీపీ గెలుపు కోసం కష్ట పడ్డ లక్ష్మీ పార్వతిని, జగన్ పక్కకు పెట్టినట్లుగానే అనిపిస్తోంది.
వైసీపీ లో కష్ట అందరికి ఏదో ఒక పదవి వచ్చింది, పోటీ చేసే అవకాశం రాని నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు జగన్. అధికారం లోకి వచ్చాక లక్ష్మిపర్వతికి కూడా మంచి పదవి వస్తుంది అని అందరూ అనుకున్నారు. చంద్రబాబు పై కానీ టీడీపీ పై కానీ ఒంటికాలు మీద లేచే లక్ష్మీ పార్వతికి వైసీపీ లో సరైన గుర్తింపు దక్కటం లేదు. వైసీపీ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు టీడీపీ పై దాడి చేయడానికి లక్ష్మీ పార్వతి ని ఉపయోగించుకున్నారని, అధికారంలోకి వచ్చాక పలకరింపు కూడా లేదు అంటున్నారు ఆమె అభిమానులు.
వాసిరెడ్డి పద్మ లాంటి నేతలకు కీలక పదవులు ఇచ్చిన జగన్, లక్ష్మీ పార్వతికి మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడు తెలుగు రాజకీయాల్లో అక్టీవ్ గా ఉండే లక్ష్మీ పార్వతి , ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చనిపోయినప్పుడు కంటతడి పెట్టుకున్న లక్ష్మీ పార్వతి, టీడీపీ తో తన అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.