ఆంధ్రుల ఆరాధ్య దైవం నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నటనలో ఎన్టీఆర్ కు మరెవరూ సాటి లేరు అంటే అతిశయోక్తి కాదు. ఒక సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా ఎంతగానో రాణించారు నందమూరి తారక రామారావు. అయితే ముఖ్యమంత్రి కాకముందు కోట్ల రూపాయలు సంపాదించిన నందమూరి తారక రామారావు చాలానే ఆస్తులను పోగేశారు. అందుకు సంబంధించిన విషయాలు చాలామందికి తెలీదు.
మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చాక మొదటిసారి హైదరాబాదులోనే ఓ స్థలం కొన్నారు. అలాగే రామకృష్ణ థియేటర్ ని నిర్మించాడు. దానితో పాటు థియేటర్ పక్కనే ఉన్న మరి కొన్ని ఆస్తులను కూడా కొన్నారు. కాగా ఇప్పుడు వీటి విలువ కోట్లలోనే ఉంది. ఎన్టీఆర్ కు ఒక కోరిక కూడా ఉండేదట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన థియేటర్ ను నిర్మించాలని.. కానీ కొన్ని కారణాల చేత సాధ్యపడలేదు.
పెళ్లికి ముందుకు అల్లు అర్జున్ ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
ముషీరాబాద్ లోని రామకృష్ణ థియేటర్, కాచిగూడ చౌరస్తాలోని తారక రామా థియేటర్, మాసబ్ ట్యాంక్ లో గుట్టపై నిర్మించిన ఐదు ఇల్లులు ఇలా సినిమాలలో సంపాదించిన సొమ్ముతో చాలానే కొన్నారు. చివరిగా కొన్న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లో ఉన్న ఇంటిని తన రెండవ భార్య లక్ష్మీపార్వతి పేరున రాశారు.
దాన వీర శూర కర్ణ బడ్జెట్ కు 15 రెట్లు లాభాలు… లెక్కలు మారాయి!!
అలాగే నాచారం హార్టికల్చర్ ఫిలిం స్టూడియో వున్న పొలాన్ని కూడా రాజకీయాల్లోకి రాకముందు సినిమాలలో వచ్చిన డబ్బుతో కొనుగోలు చేశారు. అప్పుడు కొన్న ఆస్తులు కాలక్రమేణా కోట్లు పలకడం మొదలు పెట్టాయి. ఇండస్ట్రీ చెన్నై లో ఉన్నప్పుడే కోట్ల రూపాయలు సంపాదించిన ఎన్టీఆర్ తక్కువ రేట్లు ఉన్న సమయంలో ఇవన్నీ కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు అవి కోట్ల రూపాయలు పలుకుతున్నాయి.