RRR తో షూటింగ్ దాదాపుగా కంప్లీట్ కావడంతో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టుపై జోరుగా డిస్కషన్ సాగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్- తారక్ కాంబోలో రెండో సినిమాగా.. అలాగే ఎన్టీఆర్ 30వ మూవీగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ను ఎన్నో ప్రత్యేకతలతో తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా టైటిల్..అయినను పోయి రావలె హస్తినకు.. ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంటోంది. టైటిల్ కి తగ్గట్టుగానే త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా.. ఓ క్రేజీ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ హీరో శింబును తారక్ కు విలన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట.
ఇదిలావుండగా ఈ సినిమాలో ఇప్పటికే తన క్లోజ్ ఫ్రెండ్ కమెడియన్ సునీల్ కు కోసం ఈ సినిమాలో ఓ డిఫరెంట్ విలన్ రోల్ క్రియేట్ చేసాడని సమాచారం. సునీల్ పాత్రలో కూడా నెగెటివ్ షేడ్స్ ఉంటాయని ఓ న్యూస్ వినిపిస్తోంది.అయితే సునీల్ ఇందులో నిజంగానే నటిస్తున్నాడా లేడా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు.