కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తుంది.
కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తీయట్లేదట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే గతంలో ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా అనగానే మంచి హైప్ నెలకొంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.