ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో జూనియర్ ఎన్టీఆర్ సందర్భంగా పుట్టిన రోజు గతేడాది మే 20న సినిమాపై అధికారిక ప్రకటన చేశారు. ఇటీవల ఈ సినిమా లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని అనౌన్స్ చేశారు.
జాన్వీ కపూర్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి, ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఉండటంతో సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు పెరిగాయి. కాగా, ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబోలో రాబోతున్న రెండవ చిత్రం ఇది. వారి కాంబో లో వచ్చిన మొదటి సినిమా జనతా గ్యారేజ్, ఈ సినిమా మంచి హిట్ నే అందుకుంది. అందుకే వీరి కాంబో లో రాబోతున్న ఇంకో సినిమా కాబట్టి, ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందని నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినిమా అభిమానులు వేచి చూస్తున్నారు.
జాన్వీ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. అయితే పాన్ ఇండియా సినిమా మరి అలాంటిది ఒక్క హీరోయిన్ ఎలా సరిపోతుంది. అందుకే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ని కూడా దించుతున్నారట.కథ డిమాండ్ మేరకు సెకండ్ హీరోయిన్ కూడా ఉండాల్సి ఉందట.అందుకోసం ఇప్పుడు చిత్రయూనిట్ వేట మొదలు పెట్టారు.అయితే స్టార్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అంటే చేయడానికి అందరు ఇష్టపడరు.
కానీ ఎన్.టి.ఆర్ 30 కోసం సెకండ్ హీరోయిన్ ని కూడా స్టార్ హీరోయిన్ నే తీసుకోవాలని చూస్తున్నారు. రష్మిక మందన్న, పూజా హెగ్దే చర్చల్లో ఉన్నట్టు టాక్. అదే జరిగితే ఎన్.టి.ఆర్ తో జాన్వికి జతగా మరో హీరోయిన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.