‘శతమానం భవతి’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న వేగేశ్న సతీష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమవుతున్న ‘శ్రీ శ్రీ రాజా వారు’ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఫస్ట్ లుక్ చూస్తే టెంపుల్ జాతర బ్యాక్ గ్రౌండ్ లో హీరో నితిన్ సైడ్ నుండి వాకింగ్ తో స్మోక్ చేస్తూ రఫ్ లుక్ లో కనిపించాడు. ప్రెజెంట్ మాస్ లుక్ తో నార్నే నితిన్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది.
విలేజ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ డిఫరెన్స్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని యూనిట్ చెప్తోంది. శ్రీవేదాక్షర మూవీస్ బేనర్ పై చింతపల్లి రామారావు , ఎమ్మెస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు కైలాష్ మీనన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. నితిన్ సరసన కన్నడ బ్యూటీ సంపద హీరోయిన్ గా నటిస్తుంది.
ఇటివలే తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని లోకేషన్స్ లో షూట్ పూర్తి చేశారు. విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న వేగేశ్న సతీష్ తీస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్ ఎండింగ్ లో సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.