రోడ్లు మీద వెళ్లే వాహనాలను గమనిస్తే వాటిలో కొన్ని వాహనాల నెంబర్ ప్లేట్లు డిఫరెంట్ కలర్ లో ఉంటాయి. తెలుపు రంగు నెంబర్ ప్లేట్ ఉంటే పర్సనల్ వెహికిల్ అని, పసుపు నెంబర్ ప్లేట్ ఉంటే కమర్షియల్ వెహికిల్ అని తెలుసు మరి ఇతర కలర్లుంటే…వాటి అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
తెల్ల రంగు నెంబర్ ప్లేట్:
ఇది సొంత వాహనాలకు ఇస్తారు. ఈ నెంబర్ ప్లేట్ కలిగిన వాహనాలకు…. వస్తువులను ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి, ప్రయాణికులను ఒక చోటు నుంచి మరొక చోటుకు చేర్చడానికి అనుమతి ఉండదు.
పసుపు రంగు నెంబర్ ప్లేట్:
యెల్లో కలర్ కమర్షియల్ వాహనాలకు ఇచ్చే నెంబర్ ప్లేట్… వస్తువుల రవాణాకు, ప్యాసింజర్ల రవాణాకు వాడుతుంటారు. ఓలా, యూబర్ లతో పాటు టాక్సీలన్నీ ఈ కేటగిరీలోకే వస్తాయి.
గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ :
ఈ కలర్ నెంబర్ ప్లేట్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఇస్తారు. పర్యావరణ హితం కాబట్టి గ్రీన్ కలర్ ఇస్తారు.
బ్లూ నెంబర్ ప్లేట్ :
ఈ కలర్ ను విదేశీ అతిథులకు ఇస్తారు. వీరి నెంబర్ ప్లేట్ లో రాష్ట్రానికి సంబంధించిన కోడ్ కు బదులు వారి దేశాన్ని రిప్రజెంట్ చేసే కోడ్ ఉంటుంది.
బాణం గుర్తు పైకి ఉండే నెంబర్ ప్లేట్:
బాణం గుర్తు ఉండే నెంబర్ ప్లేట్ లు మిలటరీ వాహనాలకు ఇస్తారు. ఆ బాణం గుర్తు స్థానాన్ని బట్టి, ఆ నెంబర్ సీరిస్ ను బట్టి అందులో మళ్లీ చాలా రకాలుంటాయి.