కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా రెగ్యూలర్ విధానంలో నర్సుల పోస్టులను భర్తీ చేయాలని నర్సులు డిమాండ్ చేశారు. తాత్కాలికంగా నియమించే పోస్టులలో ఎవరూ జాయిన్ కావొద్దని, హైకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ పై ప్రభుత్వం చొరవ తీసుకొని 3311 నర్సింగ్ పోస్టుల భార్తీకి చర్యలు చేపట్టాలని కోరారు.
ఇందుకోసం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి కరోనా వైరస్ పై యుద్ధం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి సంఘీభావం ప్రకటించాలని తీర్మానించారు. కరోనా పోరులో అమరుడైన డాక్టర్ నరేశ్, నర్సింగ్ ఆఫీసర్ జయమణికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబంలో ఒకరికి జాయింట్ కలెక్టర్ ఉద్యోగం, 500 గజాల స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నర్సింగ్ ఆఫీసర్లు ఎక్కడికక్కడ బ్లాక్ రిబ్బన్, బ్లాక్ జెండా పట్టుకొని నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.