శ్రీకాకులం పలాస కు చెందిన శ్రీకాంత్ పనికోసం విశాఖపట్నానికి వచ్చి నూతన్ నాయుడు ఇంట్లో పనికి చేరాడు. నాలుగు నెలలు గడిచాక అక్కడ పనిచేయడం ఇష్టంలేని శ్రీకాంత్ వెళ్లిపోయాడు.! అతడు పోయినప్పటి నుండి ఇంట్లోని ఖరీదైన ఫోన్ కనిపించడం లేదు దీంతో అతడే ఆ ఫోన్ ను తీసి ఉంటాడని అనుమానం పెంచుకుంది నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురి.!
ఇదే సమయంలో అతడి వాట్సాప్ స్టేటస్ లో పెట్టిన ఫోటోను చూసిన ఆ ఇంట్లోని తోటి పనివాళ్లు మధుప్రియాకు చూపించారు.. ఇంత క్లారిటీ ఫోటో వచ్చిందంటే..తమ ఇంట్లో పోయిన కాస్ట్లీ ఫోన్ తోనే తీసి ఉంటాడని…ఇంత ముందుకే ఉన్న అనుమానాన్ని బలపర్చుకున్నారు.!
ఇదే విషయమై ఆగస్ట్ 28 మధ్యాహ్నం 2 గంటలకు అతడిని ఇంటికి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన ప్రియా అతడి దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగింది. ఆ ఇంట్లో పనిచేసే వాళ్లు సైతం శ్రీకాంత్ మీద దాడిచేశారు. క్షురకుడిని పిలిపించి వారింట్లోనే గుండు కొట్టించారు. విషయం బయటికి చెప్తే…. అమ్మాయిలకు అసభ్య మెసేజ్ లు చేశావని తప్పుడు కేసులు పెట్టిస్తామని బెదిరించారట!
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 7 గురు మీద కేసులు పెట్టారు! సీసీటీవి ఫుటేజ్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.