(డాక్టర్ నూతన్ నాయుడు, విద్యావేత్త)
అవకాశం రానప్పుడు అవకాశం లేనప్పుడు ఆదర్శాలు ఎన్నయినా చెప్పొచ్చు. ఆకాశమంత అవకాశమున్నా, సముద్రమంత సమూహమున్నా సామాన్యుడిగా ఉండటం.. సామాన్యుడితో ఉండటం ఒక్క జనసేనానికే సాధ్యం.
రంగుల ప్రపంచాన్ని వదిలి రణక్షేత్రంలోకి రావటానికి సౌకర్యాలను వదిలి సామాన్యుడిగా బతకడానికి జనం పట్ల అచంచలమైన అభిమానం ఉండాలి. పరిధి తెలియని ప్రేమ ఉండాలి. అదీ పవన్ కల్యాణ్‌లో ఉంది.
ఆశిస్తే అధికారం అందుబాటులో ఉన్నా.. ఆదేశిస్తే ప్రపంచమే పాదాక్రాంతం అవుతున్నా.. నిబద్దతతో నిలబడటానికి, నిప్పుల కొలిమిలో దూకటానికి నిలువెత్తు వెన్నెముక కావాలి. పట్టు వదలని పిడికిలి కావాలి. చావోరేవో తేల్చుకునే సాహసం కావాలి. అది నిలువెల్లా మూర్తీభవించిన యోధుడు పవన్ కళ్యాణ్.
సంపదకు, సౌకర్యాలకు పదవులకు, ప్రలోభాలకు, అధికారానికి, అహంకారానికి, ఆడంబరాలకు, ఆభిజాత్యాలకు లొంగని ప్రజా యోగి పవన్ కళ్యాణ్ !
జనం కోసం జన్మించిన జన సేనానికి
జన్మదిన శుభాకాంక్షలు