అసెంబ్లీ సమావేశాలను రాజకీయ సభలుగా మార్చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను పొగడడం దేనికి సంకేతం. కాంగ్రెస్ ఎంఐఎంలతో బీఆర్‌ఎస్ పార్టీ చీకటి ఒప్పందం దీని వలన బయటపడింది. ఇప్పటికే బీఆర్‌ఎస్ ఖేల్ ఖతమయ్యింది. బీజేపీ ఆట మొదలైంది.
రాబోయే కాలంలో ఎవరు ఇంటికి పోతారు.. ఎవరు అందలం ఎక్కుతారో అందరూ చూస్తారు. గవర్నర్ల బదిలీ పై కూడా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అత్యున్నత స్థాయిలో పని చేసిన వ్యక్తులకు, విలువలు, సంప్రదాయాలకు నిదర్శనంగా నిలిచిన వారికి గవర్నర్ గా అవకాశం వస్తుంది.
అంతటి గౌరవనీయ గవర్నర్ల బదిలీలను కూడా విమర్శించే స్థాయికి రాజకీయనేతలు దిగజారారు. మోడీ ప్రభుత్వం ఒక గిరిజన స్త్రీని రాష్ట్రపతిని చేసినా గానీ విమర్శిస్తున్నారు.