భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రిలీజైన సూర్యవంశం అప్పట్లో బిగ్ హిట్ అయ్యింది. కుటుంబ కథగా వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమాలో వెంకటేష్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు.వెంకటేష్ మనవడిగా నటించిన బాల నటుడు అందరికీ గుర్తుండే ఉంటాడు. మరి ఆ పిల్లాడు ప్రస్తుతం ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ కుర్రాడి పేరు ఆనంద్ వర్ధన్. ఇప్పుడు ఈ పిల్లాడు పెద్దోడు అయ్యాడు..
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆనంద్ వర్ధన్ పై చదువుల కోసం విదేశాలకు వెళ్లడం వల్ల సినిమాలకు దూరమయ్యాడు. బీటెక్ పూర్తి చేసిన ఆనంద్, సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారట.
హీరో గానే ఎంట్రీ ఇవ్వాలని అనుకోవడం లేదు కానీ సినిమాల్లో మంచి పాత్రల ఎంపిక కోసం ప్రయత్నం చేస్తున్నారట. దీనికోసం ఆడిషన్స్ కి వెళ్తూనే ఉన్నారట. ఒకవేళ తనకు నచ్చిన పాత్ర దొరికితే మాత్రం సినిమాల్లో చేయడానికి రెడీ అంటున్నారు ఆనంద్ వర్ధన్..
ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియాలో కూడా తన ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆనంద్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆ ఫోటోలను చూసినవారు చిన్న ఆనంద్ ఇంత పెద్దవాడు అయ్యాడా.. హీరోకు ఏ మాత్రం తగ్గని లుక్ ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.. మరి ఈ ఆనంద్ ను మీరు కూడా చూసి మీ కామెంట్ ఏంటో తెలియజేయండి మరి..!
Also Read: సందీప్ వంగా కి ప్రభాస్ తో సినిమా తీసే ‘స్పిరిట్’ ఉందా ..!?