డిండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం… సృష్టించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతావత్ పంతులాలు తెలిపిన వివరాల ప్రకారం… ఆదివారం సెలవు కావడంతో ఎప్పటిలాగే సోమవారం ఉదయం పాఠశాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు చేరుకున్నారు.
ప్రధానోపాధ్యాయులు రూమ్ ముందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఉండటాన్ని చూసి భయాభ్రాంతులకు గురయ్యారు.దీంతో హెచ్ ఎం ఎమ్యీవో, డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కూడా పాఠశాలల తలుపులు ఇరుగొట్టి ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులకు, గ్రామ పెద్దలకు తెలియపరిచినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన తెలిపారు.
ప్రస్తుతంవ పాఠశాలలో 72 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు విద్యార్థులకు తాగడానికి మంచినీటి సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. పాఠశాల విద్యార్థుల ఇబ్బందులు చూడలేక మా పాఠశాల సిబ్బంది అందరూ కలిసి సొంత ఖర్చులతో రోజు 10 క్యాన్ల మినరల్ వాటర్ కొంటున్నామని తెలిపారు.
ఆఖరికి మధ్యాహ్న భోజనం కూడా తన సొంత ఖర్చులతో ప్రైవేట్ వ్యక్తులతో వంట చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో స్వీపర్,అటెండర్, వాచ్‌మెన్ లేక తీవ్ర ఇబ్బందులు గురి కావాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా పాఠశాలలో మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు ఆయన విన్నవించారు.