అధికారంలో చేతిలో ఉంటే.. ఇంకేముంది. ఏదైనా చెల్లుతుంది. ఏది చేసినా నడుస్తోంది. ఇక భూ కబ్జారాయుళ్ల చేతిలో అధికారం కూడా ఉంటే..అడిగే వారు, ఎదిరించే వారే ఉండరు. అందుకే ఓ మినిస్టర్ ఏకంగా రోడ్డునే కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాపం.. మంత్రి చేస్తున్న దారుణం కంటి ముందు కనిపిస్తున్నా.. ఇదేంటని నిలదీయలేదని పరిస్థితి జనానిది. నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్ పట్ల గ్రామంలో గతంలో ఉపాధిహామీ పథకంలో భాగంగా ఆర్ అండ్ బి డిపార్ట్ మెంట్ రోడ్ నిర్మించింది.
అయితే ఈ రోడ్డుకు ఆనుకొని మంత్రి ఇంద్రకరణ్ స్థలం ఉంది. దీంతో ఆయన రోడ్డునే కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ రోడ్డును ఇప్పుడు ఆక్రమించేలా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కంచె ఏర్పాటు చేస్తున్నారని చెబుతున్నారు. ఒక వేళ అది నిజంగా ప్రైవేట్ స్థలం అయితే అప్పుడు రోడ్డెలా నిర్మించారు.. రోడ్డే అయితే మంత్రి ఎలా ఆక్రమిస్తున్నారనేది స్థానికులను తొలచివేస్తున్న ప్రశ్న.
మరి అధికారుల దృష్టికి కూడా వెళ్ళిన ఈ రోడ్డు కబ్జా వ్యవహారంలో వాళ్లు ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.