అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం మహాసముద్రం. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇదిలా ఉండగా… ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ. 11 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది.