ఫోటో అంటే ఎవరికిష్టం ఉండదు. కొందరికి దిగడం ఇష్టం. మరికొందరికి తీయడమంటే సరదా. ఇంకొందరికీ అయితే అదే హాబీ. కంటికి అందమైన దృశ్యం కనిపిస్తే వెంటనే దాన్ని కెమెరాలో బంధించాలని చూస్తారు. తాజాగా 2021 ఓషన్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ ను ప్రకటించారు. అందులో ఎంపికైన ఫోటోలను చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదు.
పోటీకి వచ్చిన ఫోటోలలో తాబేలు చిత్రం బెస్ట్ గా నిలిచింది. అది తీసిన ఐమీ జాన్.. ఓషన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచారు. ఆకుపచ్చ తాబేలును గ్లాస్ చేపలు చుట్టుముట్టినప్పుడు తీసిన ఈ ఫోటో అందర్నీ ఆకట్టుకుంటోంది.
ఇక గాలానికి చిక్కి చనిపోయిన మోరే ఈల్ ఫోటో తీసిన కెరిమ్ సబున్ క్యుగ్లు కన్జర్వేషన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ గా గెలుపొందారు. అలాగే బెన్ థౌవర్డ్ సాహస ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు.