తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఒడిశా మాజీ సీఎం, సీనియర్ పార్లమెంట్ సభ్యుడు గిరిధర్ గమాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కలిసి ఆయన కాసేపు భేటీ అయ్యారు.
ఆయనతో పాటు ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్, ఇతరులు కూడా కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి ఇరువురి మధ్య కీలక చర్చ జరిగింది.
జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అవుతున్నారు. దేశంలో నెలకొన్ని సమస్యలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు.
ఇక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షున్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు ఈనెల 18వ తేదీన ఖమ్మంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు దేశ నలమూలల నుంచి పలువురు రాజకీయ నేతలు, రైతు సంఘం నాయకులు హాజరవుతారని తెలుస్తోంది.