కరోనా వైరస్ ఇప్పుడు ఒడిశాలో కలకలం సృష్టిస్తోంది. కరోనా వైరస్ సోకిన చైనాతో తో సహా ఇతర దేశాల నుంచి జనవరి 15 తర్వాత సొంత రాష్ట్రానికి వచ్చిన వారిపై ప్రభుత్వం నిఘా పెట్టింది. వారిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నామని..ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో వారిని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
ఇండియాలోని కేరళలో మూడు కరోనా వైరస్ కేసులను గుర్తించినప్పటికీ వారిలో మొదటి బాధితుడు పూర్తిగా కోలుకున్నారు. ఇంకా ఇద్దరికి చికత్స కొనసాగుతోంది. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఆ ముగ్గురు కూడా చైనా నుంచి స్టూడెంట్స్. అది తప్ప దేశంలో ఇంకా ఎక్కడా కరోనా కేసులు నిర్ధారణ కాలేదు. చైనా నుంచి వచ్చిన ఇంకా కొంత మంది విద్యార్ధులను ప్రత్యేక ప్రాంతాల్లో అబ్జర్వేషన్ లో ఉంచారు.
జపాన్ నౌకలో భారతీయులు :
జపాన్ లోని యెకోహోమా తీర ప్రాంతంలో ఉన్న విహార నౌక ‘ డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్’ లో నిర్బంధించిన భారతీయులను బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇండియా రాయభార కార్యాలయం తెలియజేసింది. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే వారందరిని ఇండియా రప్పిస్తామన్నారు. ఇప్పటి వరకు ముగ్గురు భారతీయులతో సహా నౌకలోని 218 మందికి వ్యాధి సోకినట్టు గుర్తించారు. ముగ్గురు భారతీయుల పరిస్థితి నిలకడగానే ఉందని…ఎప్పడికప్పుడు జపాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు భారతీయ రాయభార కార్యాలయం తెలిపింది. నౌకలో 3 వేలకు పైగా ప్రయాణీకులున్నారు. వారిలో 160 మందికి పైగా నౌకా సిబ్బంది ఇండియన్స్.
చైనాలో మృతులు 1600 :
మరో వైపు ఈ వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనాలో శనివారం నాటికి 1600 మంది చనిపోయారు. శుక్రవారం ఒక్క రోజే 143 మంది వైరస్ బారిన పడ్డారు. వారిలో 139 మంది హుబెయ్ ఫ్రావిన్స్ కు చెందిన వారు. కొత్తగా నమైదైన కేసుల సంఖ్య 66,492 కు చేరింది. వైరస్ ను కట్టడి చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగించాలని ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ పిలుపు నిచ్చారు. ల్యూనార్ న్యూ ఇయర్ హాలీడేస్ ముగియడంతో రాజధాని బీజింగ్ కు బయలు దేరిన వారిని మరో 14 రోజులు ఇళ్లకే పరిమితం కమ్మని ప్రభుత్వం ఆదేశించింది. వైరస్ వ్యాప్తించే అవకాశాలున్నందున ఈ ఆదేశాలిచ్చింది. కరోనా వైరస్ తమకు సవాల్ గా మారినప్పటికీ ప్రభుత్వం దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని…అయితే కొన్ని దేశాలు ఓవరాక్షన్ చేస్తున్నాయని చైనా విదేశాంగా మంత్రి విమర్శించారు. తమ కృషి వల్ల వైరస్ ఇప్పుడు కంట్రోల్ లోనే ఉందని చెప్పారు.
ప్రస్తుతం హుబెయ్ ఫ్రావిన్స్ లో తప్ప దేశంలోని మిగతా ప్రాంతాల్లో గత 10 రోజుల్లో కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గడం శుభసూచకమని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అధికార ప్రతినిధి లియాంగ్ వానియన్ అన్నారు. హుబెయ్ ఫ్రావిన్స్ రాజధాని వుహాన్ లో వైరస్ తీవ్రంగా ఉందని అన్నారు. వైరస్ అనుమానితులను, వైరస్ నిర్ధారణ జరిగిన వారికి చికిత్స చేసేందుకు కొత్తగా మరిన్ని ఫీల్డ్ హాస్పిటల్స్ ను నిర్మించనున్నట్టు హుబెయ్ ఫ్రావిన్స్ ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే 6,900 పడకలతో 9 ఫీల్డ్ హాస్పిటల్స్ ను నిర్మించారు.
చైనాలో ఈ వ్యాధి సోకి చనిపోయిన వారిలో ఎక్కువ మంది హుబెయ్ ఫ్రావిన్స్ లోనే ఉన్నారు. 25 దేశాలకు వైరస్ వ్యాపించినప్పటికీ …చనిపోయిన వారు ముగ్గురు. వారిలో ఒకరు హాంగ్ కాంగ్, ఒకరు ఫిలీప్పీన్స్. ఒకరు జపాన్ లో చనిపోయారు. ఆఫ్రికన్ కంట్రీస్ లో మొదటి సారిగా ఈజిప్ట్ లో శుక్రవారం మొదటి కేసును గుర్తించారు.
జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ పోటీకి దూరంగా చైనా :
కరోనా వైరస్ కారణంగా వచ్చే వారం ఆస్ట్రేలియాలోని మెల్ బోర్స్ లో జరగనున్న వరల్డ్ కప్ జిమ్నాస్టిక్స్ పోటీలకు చైనా దూరంగా ఉంది. వైరస్ భయంతో ఆస్ట్రేలియా విమాన ప్రయాణీకులపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ప్రయాణీకులను తమ దేశంలోకి అనుమతించడం లేదు. దీంతో ఈ నెల 20-30 తేదీల మధ్య జరిగే పోటీల్లో పాల్గొనడం లేదు.