భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి అంటోనీ ఆల్బెన్స్ తో ఈ రోజు సమావేశం అయ్యారు. వారిద్దరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారిద్దరూ చర్చించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ చర్చలు తమ వ్యూహాత్మక భాగస్వామ్యం స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర మంత్రి జైశంకర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సిడ్నీలోని కిర్రిబిల్లీలో ఆస్ట్రేలియా ప్రధాని అంటోని ఆల్బెన్స్ ను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రధాని మోడీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్టు చెప్పారు. అనంతరం ఆయన మరో ట్వీట్‌లో… ఇరువురి మధ్య క్రికెట్ ప్రస్తావన కూడా వచ్చిందన్నారు. ఇండియా-ఆస్ట్రేలియాలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తపడుతున్న నేపథ్యంలో ఆ అంశంపై కూడా చర్చించామన్నారు.
ఈరోజు ఉదయం సిడ్నీలోని రైసినాలో భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ… కొవిడ్ -19 సవాళ్లను భారతదేశం చాలా సమర్థవంతంగా అధిగమించిందని ఆయన చెప్పారు. మహమ్మారి ఒత్తిడిలోనూ అనేక సంస్కరణలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు.