ఏపీలో పంచాయితీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వం ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. ఉదయం నోటిఫికేషన్ విడుదల చర్యలు తప్పవంటూ తీవ్రస్థాయిలోనే కమిషనర్ హెచ్చరించినా అధికారుల నుండి పెద్దగా స్పందన లేదు.
ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీఎస్, డీజీపీలతో కమిషనర్ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ కోసం సమాచారం అందించారు. కానీ ఈ సమావేశానికి సీఎస్, డీజీపీ, పంచాయితీరాజ్ అధికారులతో పాటు పలు జిల్లాల కలెక్టర్లు హాజరుకాలేదు. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఈనెల 25 వరకు సెలవులపై వెళ్లారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ కు తూ.గోదావరి, కడప, ప్రకాశం, అనంతపురం, గుంటూరు జిల్లాల అధికారులు దూరంగా ఉన్నారు. అధికారులు హజరు కోసం కమిషన్ ఎదురుచూస్తుండగా… టెక్నికల్ ఎర్రర్ అంటూ అధికారులు తప్పించుకుంటున్నారు.
అయితే, ప్రభుత్వ పెద్దల నుండి ఆదేశాలు అందటంతోనే అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.