తెలంగాణలో భారీఎత్తున ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల బదిలీలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 14న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుతో ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఆ వెంటనే బదిలీల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో గతేడాది కాలంగా బదిలీల జాబితాలు సిద్ధమవుతున్నా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరుపై ఇప్పటికే నివేదికలు సిద్ధం చేసిన సీఎస్ సోమేష్ కుమార్ వాటిని సీఎంకు సమర్పించారు. ఎంతకాలం నుంచి అధికారులు ఆయా పోస్టుల్లో ఉన్నారో.. వారి పనితీరు ఏ విధంగా ఉందో తదితర వివరాల్ని నివేదికలో పొందుపరిచి అప్పగించారట. ఈ నెల 15 నుంచి దీనిపై కేసీఆర్ తో సీఎస్ సమావేశం కానున్నారని తెలుస్తోంది.