ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత ఎన్టీఆర్ ఎవరితో సెట్స్ పైకి వెళతాడనే ప్రశ్న ఉత్పన్నమైంది. కొంతమంది వెట్రిమారన్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని, మరికొంతమంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళతాడని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా… ఎన్టీఆర్ తన తరువాత సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేస్తారని అధికారిక ప్రకటన వెలువడింది. హారిక అండ్ హాసినివారితో కలిసి ఈ సినిమాను నిర్మించడానికి, కల్యాణ్ రామ్ అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను త్రివిక్రమ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో ఉన్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైన్ గా ఈ సినిమాను రూపొందించనున్నారని తెలుస్తోంది.