ప్రతిరోజు పండగే సక్సెస్ తర్వాత మరో సినిమాను అధికారికంగా ప్రకటించారు డైరెక్టర్ మారుతీ. గత కొన్ని రోజులుగా జరుగుతున్న అనేక ప్రచారాల నేపథ్యంలో గోపిచంద్ హీరోగా కామెడీ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు ప్రకటించాడు. ఓ ఫన్నీ వీడియోతో గోపిచంద్ మూవీని దృవీకరించాడు.
ఓ లాయర్ పాత్రలో గోపిచంద్ నటించనుండగా… పక్కా కమర్షియల్ అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నారు. సిటీమార్ సినిమా షూట్ పూర్తవ్వగానే ఈ సినిమా మొదలుకానుంది. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించనుంది.
నిజానికి ఈ మూవీని మాస్ మహారాజ్ రవితేజతో ప్లాన్ చేసినప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం సాగుతుంది.
After Bhale Bhale Magadivoi, Prati Roju Pandaage Successful @DirectorMaruthi @GA2Official @UV_Creations #AlluAravind #BunnyVas collaborated together 3rd time with Macho Hero @YoursGopichand for a unique commercial entertainer.#Gopichand29 #Maruthi10
First Look & Title soon pic.twitter.com/LW5Niik5vr
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) January 7, 2021