ఇండియాలో కరోనా అత్యవసర వ్యాక్సినేషన్ కు కోవాక్జిన్, కోవిషీల్డ్ లకు కేంద్ర సంస్థలు ఇప్పటికే అనుమతిచ్చాయి. దీంతో అతిపెద్ద వ్యాక్సినేషన్ కు ఓవైపు రెడీ అవుతూనే మరోవైపు… వ్యాక్సిన్ రవాణా, సరఫరా, వ్యాక్సిన్ పంపిణీ, నిల్వ వంటి అంశాలపై ఫోకస్ చేసింది.
మరోవైపు ఈ రెండు కంపెనీల వ్యాక్సిన్స్ ను ఇతర దేశాలకు ఇప్పటికిప్పుడు ఎగుమతులకు అవకాశం ఇవ్వలేదు. ఓవైపు వ్యాక్సిన్ తయారీ కొనసాగుతుండగానే… మరోవైపు మాస్ వ్యాక్సినేషన్ కు రెడీ అయ్యింది. తొలుత జనవరి 13 నుండి వ్యాక్సిన్ ఇచ్చేందుకు రెడీ అవ్వగా, జనవరి 16 నుండి మొదలుపెట్టబోతున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించనుంది. ముందుగా కరోనా వారియర్స్ గా ఉన్న 3కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
దేశంలో వ్యాక్సినేషన్ సజావుగా సాగేందుకు సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారు.