హైదరాబాద్ నగరాన్ని గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు వణికిస్తున్నాయి.భారీగా కురిసిన వర్షాలకు నగరంలో ఎక్కడ చూసిన బురద, చెత్త పేరుకుపోయాయి. మూసీ నది ఉద్ధృతంగా ప్రవహించడంతో మూసారాంబాగ్ వంతెన ధ్వంసం అయ్యింది.
దీంతో ధ్వంసమైన వంతెనపైన జీహెచ్ఎంసీ అధికారులు మరమ్మతులు చేపట్టారు. వంతెనపై పూర్తిగా బురద, రాళ్లు పేరుకుపోవడంతో వాటిని తొలగిస్తున్నారు. వంతెనపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. రెండు వైపులా ఎవ్వరినీ వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వరదలకు పూర్తిగాదెబ్బతిన రోడ్డు, వంతెనపై రెయిలింగ్, వరద ప్రవాహానికి వంతెన బాగా దెబ్బతిందని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్ తెలిపారు.
సాయంత్రం లోగా పనులను పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్డు మరమ్మతుల నేపథ్యంలో అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్ వెళ్లే వాహనాలను గోల్నాక దగ్గర మళ్లిస్తున్నారు.