ప్రధాని మోడీకి సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మోడీకి జర్నలిస్టులు ఏదో ఫిర్యాదు చేస్తుండగా, ఆయన ‘ ఓ మై గాడ్’ అని అనడం కనిపిస్తోంది.
ప్రధాని మోడీ ఇటీవల మూడు రోజుల పర్యటన నిమిత్తం యూరప్ వెళ్లారు. పర్యటనలో భాగంగా భారత సంతతికి చెందిన ప్రజలను కలుసుకుని వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఆ సమయంలో ప్రధాని ప్రసంగాన్ని కవర్ చేసేందుకు భారత్ కు చెందిన పాత్రికేయులను అధికారులు అనుమతించలేదు. దీంతో వారు ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు.
దీంతో ఆయన ‘ ఓ మై గాడ్’… అని అది ఎలా జరిగిందో తెలుసుకుంటానని జర్నలిస్టులతో అన్నారు. మీరు మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవాలని వారికి ఆయన సూచించారు.