హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలను చేస్తున్నాడు హీరో శర్వానంద్. ఇటీవలే మహాసముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సాంగ్ హీరో. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఒకే ఒక జీవితం సినిమాతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు.
ఇందులో ఒకే ఒక జీవితం సినిమాకు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడిగా శ్రీ కార్తీక్ కు ఇది మొదటి సినిమా. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమాలో ని ఫస్ట్ సింగిల్ అమ్మ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సినిమాలో శర్వానంద్ కు అమ్మగా అక్కినేని అమల నటిస్తున్నారు. ఇద్దరి మధ్య సాగే ఈ ఎమోషనల్ సాంగే ఈ అమ్మ పాట. దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాటను అక్కినేని అఖిల్ సోషల్ మీడియా వేదిక గా రిలీజ్ చేశారు.