కరోనా వైరస్ సృష్టిస్తున్న భయోత్పాతం మామలుగా లేదు. ప్రపంచ దేశాల్లోని జనం అంతా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా భయంతో వణికిపోతున్నారు. అగ్ర రాజ్యం అమెరికా నుండి చిన్న చిన్న దేశాల వరకు కరోనా భాదితులే. మరోవైపు ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే స్థితికి జారిపోతున్నాయి.
అయితే, కరోనా వైరస్ భయం హైదరాబాద్ అల్వాల్‌లోని ఓ ఆపార్ట్‌మెంట్ వాసులకు మానవత్వం మర్చిపోయేలా చేసింది. ఆ వృద్ద దంపతులు చేసిన తప్పంతా… తమ బిడ్డలతో నాలుగు రోజులు గడిపేందుకు విదేశాలకు వెళ్లి వచ్చారు. దీంతో అపార్ట్‌మెంట్‌లోని జనం అంతా… వీరికి కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో అపార్ట్‌మెంట్‌ను వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారు. దానికి వారు అంగీకరించకపోయినా… బలవంతంగా బయటకు గెంటేయించినట్లు ప్రచారం సాగుతోంది. 50కుటుంబాల వరకు ఉన్న ఆ ఆపార్ట్‌మెంట్ వాసులు ఒక్కరు కూడా జాలీ చూపకపోవటంతో… ఆ వృద్ద దంపతులు ఆపార్ట్‌మెంట్ ఎదుటే ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే… అల్వాల్‌లో ఎక్కడ ఇది జరిగిందన్న పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.