ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి జాలౌన్‌లో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. ఇంటి నిర్మాణం కోసం తవ్వుతుండగా పురాతన నాణేలు, వెండి ఆభరణాలు వెలుగుచూసాయి. కొత్వాలి జాలౌన్‌లోని వ్యాస్ పురా గ్రామానికి చెందిన కమలేశ్ కుశ్వాహా అనే వ్యక్తి తన ఖాళీస్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాడు.
ఇందులో భాగంగా పునాది తవ్వుతుండగా ఓ ట్రంకు పెట్టె బయటపడింది. దానిని వెలికితీసి చూడగా.. అందులో నాణేలు, వెండి నగలు లభించాయి. ఆ పెట్టెలో మొత్తం 279 పురాతన నాణేలను గుర్తించారు. దీంతో అతడు అధికారులకు సమాచారం అందించాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ రాజేశ్ సింగ్.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులకు విషయాన్ని తెలిపారు. దీంతో వారు ఆ బెట్టెను స్వాధీనం చేసుకున్నారు. నగలు, నాణేలు 1862 నాటి బ్రిటిష్ కాలానికి చెందినవిగా గుర్తించారు