హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. క్రిస్టియన్ కాలనీలో నివాసం ఉండే మోహన్ రెడ్డి, అనంతలక్ష్మి అనే దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు 100కు డయల్ చేయడంతో స్పాట్ కు చేరుకుని పోలీసులు విచారణ జరిపారు.
మోహన్ రెడ్డి ఆరోగ్య శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారని తెలిపారు పోలీసులు. మూడు రోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇంట్లోకి ఎవరూ వెళ్లకపోవడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి మృతదేహాలు.