పెళ్ళిళ్ళలో ఫోటోల కల్చర్ పోయి, పెళ్ళికి ముందు ఫోటోలు తీయించుకునే కల్చర్ వచ్చేసింది. గట్టిగా చెప్పాలంటే ఒక్కప్పుడు పెళ్లిలో కూడా ఫొటోలు ఉండేవి కావు .పెళ్ళికి సంబంధించిన వివిధ ముఖ్య ఘట్టాలలో మాత్రమే లెక్కగా ఫోటోలు తీసేవారు. ఇప్పుడు పెళ్ళికన్నా ఫొటోటేలే ఎక్కువ ఉంటున్నాయి.ప్రస్తుతం ప్రీవెడ్డింగ్ ఫోటోషూట్ అని వచ్చింది. కాబోయే వధూవరులు అందమైన లోకేషన్లకు వెళ్లి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌లతో వింత వింత ఫోజుల్లో ఫోటోలు, వీడియోలు వింత వింత ఫోజుల్లో ఫోటోలు తీయించుకుని వాటిని వెడ్డింగ్ ఇన్వినేషన్స్ కూడా రూపొందించి సామాజిక మాధ్యమాల్లోకి తర్పణం వదులుతున్నారు.
ఈ విషయాన్ని పక్కనబెడితే ఇటీవల ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లో ఓ కామెడీ జరిగింది. ఉత్తరాంద్రలో ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్ళిన జంట మధ్యలోకి ఓ తాతయ్య ఎంటరై వాళ్ళని గందరగోళానికి గురిచేసాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..ప్రీ వెడ్డింగ్ షూట్లు స్పెషల్ గా ఉండేందుకు మంచి మంచి లోకేషన్లు, నదులు, సముద్రం.. కొండలు, అందమైన పార్కులు..ఇలా ఎన్నో ఎంచు కుంటున్నారు..ఇక్కడ ఆ జంట కాస్త డిఫరెంట్‌గా నాటు పడవలో ఓ నదిలో ఫొటోలు దిగాలనుకున్నారు..
ఇక్కడే వాళ్లకు వింత అనుభవం ఎదురైంది..నాటు పడవ నడిపిన తాత..టాలెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..అమ్మాయి, అబ్బాయి ఫొటో ఎలా దిగాలి.. ఎలాంటి ఫోజులు ఇవ్వాలి..ఇలా నిలిచోండి.. అలా చేయి పట్టుకోండి..చేయి ఇలా పెట్టు, కాలు ఇలా పెట్టు, అమ్మాయిని ఇలా పట్టుకో, ఇద్దరూ అటు చూసి ఫోజు ఇవ్వండి.. నువ్వు చేయి పైకి ఎత్తు.. అమ్మాయి.. ఆ చేయి పట్టుకుని చుట్టూ తిరుగుతుంది.. ఇలా.. తనలోని కిక్కిరిసిన క్రియేటివిటీనీ ఒక్కసారిగా బైటకి తీశాడీ తాత.
ఉత్తరాంద్ర యాసలో ఆయన మాటలు వింటుంటే.. నవ్వకుండా ఉండలేరు.. ఎంతటివారైనా పొట్ట చెక్కలయ్యేలా నవ్వితీరాల్సిందే..పాపం ! ఆ కాబోయే జంట మాత్రం ఉత్తరాంధ్రా తాతలోని కళావేశానికి, ఫోటోగ్రఫీలోని అభినివేశానికీ బిత్తరపోయి చూస్తూ ఉండిపోయారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయిన ఆ వీడియోను షేర్ చేస్తూ.. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు..
తాతయ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. పడవ నడిపే తాతే ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లాప కన్పిస్తున్నాడని కొందరు కామెంట్ పెడితే.. తాతయ్య టాలెంట్ సూపర్ అంటూ మరికొందరు.. తాతకి అవకాశం ఇవ్వాలే గానీ.. మంచి రొమాంటిక్ మూవీ కూడా తీసేలా ఉన్నాడు అంటూ ఇంకా కొందరు కామెంట్ పెడుతున్నారు..