– కేసీఆర్ డౌన్ డౌన్ అన్న వృద్ధుడు
వికారాబాద్ పట్టణ కేంద్రంలో ఓ వృద్ధుడు వినూత్న నిరసన చేపట్టాడు. చేతిలో తలకొరివి పట్టుకొని, నుదుటిపై రూపాయి బిళ్ళ కట్టుకుని రామయ్య గూడ రోడ్డునుండి ప్రధాన రోడ్ల గుండా నిరసన చేపట్టాడు. తన ఇంటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయాల్లో అనేకసార్లు ఇచ్చిన వినతి పత్రాలను పోస్టర్ పై అతికించి భుజానికి కట్టుకొని, దీనికి తోడు అర్ధ నగ్న ప్రదర్శన చేస్తూ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపాడు.
అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోకపోవటంతో విసిగిపోయి, ఆఖరికి ఇలా నిరసనకు దిగాడు. కనీసం ఇలా చేస్తేనన్నా తనవైపు ఎవరన్నా చూస్తారేమోనని ఆశ అంటూ తన నిరాశాపూరిత కథ వినిపించాడు. వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసముంటున్న 73 సంవత్సరాల ఈ వృద్ధుడు కృష్ణ.. పంక్చర్ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తన ఇంటి సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇలా నిరసన చేపట్టాడు.