ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్..నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. ఓం రౌంత్ డైరెక్షన్లో.. మోషన్ సెన్సార్ టెక్నాలిజీతో తెరకెక్కుతున్న ఈ పౌరాణికంలో డార్లింగ్ రాముడిగా కనిపిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్‌తో అందర్నీ షాక్ చేసింది. గ్రాఫిక్ బాలేదనే కామెంట్ అందరి నుంచి వచ్చేలా చేసింది. దీంతో మరో సారి రంగంలోకి ఓం రౌత్ ఈ సినిమా గ్రాఫిక్స్ మళ్లీ రీ డిజైన్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు.
మరో 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రొడ్యూసర్ ను ఒప్పించారు. ఇక ఈ క్రమంలోనే ఆదిపురుష్ రిలీజ్ మరింతగా ఆలస్యం అవుతుందనే న్యూస్ నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేశారు.
దీంతో రంగంలోకి దిగిన ఆదిపురుష్ మేకర్స్… తమ సినిమాను సంక్రాంతికి కాకుండా…వచ్చే యేడాది జూన్ 16న రిలీజ్ చేస్తున్నామని తాజాగా అనౌన్స్ చేశారు. ఈన్యూస్ తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ న్యూస్ తెలుస్తోంది. శ్రీరామ నవమి నుంచి వరుసగా అప్డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్. మార్చి 30 నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్. దాంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.