టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి చానుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆమెను సర్‌ప్రైజ్ చేశారు. తనను అభినందించేందుకు స్వయంగా ఆయనే రావడంతో ఉబ్బితబ్బిబైపోయింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌లో పంచుకుంది. థ్యాంక్యూ సల్మాన్ ఖాన్ సార్. నేను మీకు పెద్ద అభిమానిని. మిమ్మల్ని కలవాలన్న నా కోరిక తీరింది అంటూ అందులో చెప్పుకొచ్చింది. మరోవైపు తనను అభినందించేందుకు వచ్చిన సల్మాన్‌కు జింకల బొమ్మతో కూడిన శాలువాను కప్పి సత్కరించింది చాను.
చానును కలిసి విషయాన్ని సల్మాన్ కూడా ట్విట్టర్‌లో పంచుకున్నారు. సిల్వర్ మెడల్ దక్కించుకోవడం చాలా సంతోషం. మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉంది. ఆశీస్సులు ఎప్పటికీ మీతో ఉంటాయి అని అందులో రాసుకొచ్చారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు.
Thank you so much @BeingSalmanKhan sir. I am a big fan of you and it was like a dream come true for me. https://t.co/CjGEA5fCEU
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 11, 2021
Advertisements