నాంపల్లి సీబీఐ కోర్టులో ఓబులాపురం గనుల కేసు విచారణ జరిగింది. తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాదనలు కొనసాగాయి. ఓఎంసీ కేసు నుంచి తన పేరును తొలగించాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
అయితే.. ఈనెల 24న వాదనలు ముగించాలని సబిత తరఫు న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత వాదనలకు మరింత గడువు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది న్యాయస్థానం. తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది.