ఒమిక్రాన్ వేరియంట్ అనేది ఓ సైలెంట్ కిల్లర్ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఒమిక్రాన్ నుంచి కోలుకోవడానికి అసాధారణంగా తనకు ఎక్కువ సమయం పడుతోందని అన్నారు.
సుప్రీం కోర్టులో పూర్తి స్థాయిలో భౌతిక విచారణలు మొదలు పెట్టాలని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ ప్రధాన న్యాయమూర్తిని కోరారు.
‘ భౌతికంగా విచారణలు మొదలవ్వడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఒమిక్రాన్ అనేది ఓ వైరల్ ఫీవర్ లాంటిది. దీని లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. ప్రజలు త్వరలోనే దీని నుంచి కోలుకుంటారు. అందువల్ల సుప్రీం కోర్టులో పూర్తి స్థాయిలో భౌతిక విచారణలు మొదలు పెట్టాలని కోరుతున్నాను” అని వికాస్ సింగ్ అన్నారు.
దానికి సీజేఐ ఎన్వీ రమణ స్పందిస్తూ… ‘ ఒమిక్రాన్ ఓ సైలెంట్ కిల్లర్. ఫస్ట్ వేవ్ లో నేను కరోనా బారిన పడ్డాను. దాని నుంచి నాలుగు రోజుల్లో కోలుకున్నాను. కానీ ఇప్పుడు ఈ వేవ్ లో కరోనా బారిన పడి 25 రోజులవుతోంది. ఇప్పటికి కరోనా అనంతర ప్రభావాలతో బాధపడుతున్నాను” అని అన్నారు.