కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారత్ లో రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. కొత్తగా ఈ రోజు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో ఢిల్లీ, రాజస్థాన్ లో చెరో నాలుగు కేసులు బయటపడ్డాయి. దీంతో ఢిల్లీలో మోత్తం కేసుల సంఖ్య 6కు చేరగా.. రాజస్థాన్ లో 13కి చేరాయి.
భారత్ లో డిసెంబర్ 2న తొలికేసు నమోదు కాగా.. ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 50కి చేరువలో ఉంది. అటు, మహారాష్ట్రలో ఈ మహమ్మారి విజృంభణ చేస్తుంది. అక్కడ ఇప్పటివరకు 20 కేసులు వెలుగు చూశాయి. అటు, రోజురోజుకు ఒమిక్రాన్ బాధితులు పెరగడంతో ప్రభుత్వాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి.