ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా భారత్‌లో విజృంభిస్తోంది. తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఒకే కుటుంబంలో 9 మందికి పాజిటివ్ గా తేలింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి జైపూర్‌కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. అది ఒమిక్రాన్ గా బయటపడింది. వారితో ఉన్న మరో ఐదుగురు కుటుంబ సబ్యులకు పరీక్షలు నిర్వహించగా వారికీ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ 9 మందిని ఆర్యూ హెచ్‌ఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని.. లక్షణాలేమీ లేవని వైద్యులు తెలిపారు. అయితే ఈ తొమ్మిది మంది వ్యక్తులు నవంబర్ 28న సుమారు 100 మందికి పైగా హాజరైన ఓ వివాహ వేడుకల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో అనే ఆందోళన ప్రజల్లో మొదలైంది.