తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా స్విట్జర్లాండ్ నుంచి వరంగల్ కు వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకింది. దీంతో ప్రజలు కంగారు పడుతున్నారు.
ఈ నెల 12న వరంగల్ వచ్చిన ఆ వ్యక్తి… నగరంలోని బ్యాంక్ కాలనీలో ఉన్నాడు. అతని కుటుంబం సభ్యులతో పాటు మరో 20 మంది కాంటాక్టులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.