ముంబైని ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ లో పరీక్షించిన స్వాబ్ శాంపిల్స్ లో 95 శాతం ఒమిక్రాన్ పాజిటివ్ లే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు బృహత్ ముంబై మున్సిపాలిటీ కార్పొరేషన్ ఓ రిపోర్టును విడుదల చేసింది.
ముంబైలో 190 శాంపిల్స్ పరీక్షించగా అందులో 180(94.74)శాతం ఒమిక్రాన్ సోకినట్టు తేలిందని రిపోర్టులో పేర్కొంది. మిగిలిన శాంపిల్స్ లో 3 డెల్టా వేరియంట్(1.58), ఒక ఒమెగా( 0.53), 6ఇతర కరోనా వేరియంట్లు (3.16) శాతం ఉన్నట్టు నివేదికలో తెలిపింది.
190 మంది(శాంపిల్స్ పంపిన వారి)లో 23 మంది మరణించారని నివేదిక చెప్పింది. మొత్తం 190 మందిలో 61 నుంచి 80 ఏండ్ల మధ్య వారు 74 మంది (39 శాతం), 41మంది (22 శాతం) in 41నుంచి 60 ఏండ్ల వారు, 21 నుంచి 40 ఏండ్ల వారు 36 మంది(19శాతం), 81 నుంచి 100 ఏండ్ల వారు 22 మంది(12శాతం), 0 నుంచి 18 ఏండ్ల వారు 17 మంది(9)శాతం ఉన్నట్టు తెలిపింది.
ఇందులో 106 మందికి ఆస్పత్రిలో చికిత్స అవసరమైంది. వీరిలో కేవలం 5గురు మాత్రమే మొదటి డోసు తీసుకున్నారు. 50 మంది రెండు డోసులు తీసుకోగా, 51 మంది అసలు ఏ డోసూ తీసుకోలేదు. 106 మందిలో కేవలం 9 మందికి మాత్రమే ఆక్సిజన్ సపోర్ట్, 11 మంది ఐసీయూలో చికిత్స అవసరమైంది” అని నివేదికలో వెల్లడించింది.