సినీ ఇండస్ట్రీలో చాలామంది కరోనా బారిన పడుతున్నారు. తాజా గా నటి, డాన్సర్ శోభనకు ఒమిక్రాన్ నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ మహమ్మారి బారిన పడినట్లుగా చెప్పుకొచ్చారు.
తను వాక్సిన్ కూడా తీసుకున్నట్లు తెలిపారు. వాక్సిన్ తీసుకున్నందుకు సంతోషిస్తున్నానని ఎందుకంటే అది 85 శాతం వరకు వైరస్ అభివృద్ధి ను చేయకుండా నిరోధిస్తుందని అంటూ చెప్పుకొచ్చారు. మీరు ఇప్పటికీ అలా చేయకుంటే వాక్సిన్ తీసుకోమని కోరుతున్నా అంటూ పోస్ట్ పెట్టారు.