దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ప్రతిరోజు కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో 16 కేసులు వెలుగు చూశాయి. దీంతో, ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 169 కి చేరింది. ఢిల్లీలో 6, కర్ణాటకలో 5 కేరళలో 4 నమోదయ్యాయి. భారత్ లో మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. ప్రతిరోజు కొత్త కేసులు వెలుగు చూడటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నాయి.
రానున్న రోజుల్లో పండగల సీజన్ మొదలు కావడంతో ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేదానిపై ఆలోచనలు చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మాస్కులు వాడకం గణనీయంగా తగ్గిందని.. దీంతో ఒమిక్రాన్ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు