దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మంగళవారం కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 57కి చేరింది. ఢిల్లీలో 4 కేసులు, మహారాష్ట్రలో 8 కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలో వెలుగుచూసిన కేసుల్లో అందరూ విదేశాల నుంచి వచ్చిన వారేనని తేలింది. కానీ, మహారాష్ట్రలో బయటపడ్డ 12 కేసుల్లో ఎవరూ విదేశాల నుంచి రాలేదు.
దీంతో సామాజిక వ్యాప్తి జరుగుతోంది ఏమో అని మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. ప్రభుత్వాలు అలర్ట్ అయ్యి.. కరోనా నిబంధలనలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. మాస్క్ వాడకం, భౌతికదూరం తప్పనిసరి చేస్తున్నాయి.