తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియెంట్ కేసు నమోదైంది. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్ డమ్‌లలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ల వేవ్ వెనుక ఉన్న ఈ కరోనా సూపర్ వేరియంట్ కేసులు తెలంగాణలో కూడా నమోదయ్యింది. తాజాగా ప్రమాదకరమైన ఒమిక్రాన్ XBB.1.5 వేరియంట్ కేసు వెలుగులోకి వచ్చింది. గురువారం దేశ వ్యాప్తంగా ఒక్కరోజే ఎనిమిది మందికి ఈ కొత్త వేరియంట్ సోకింది.
దేశంలో మొదటి ఒమిక్రాన్ XBB.1.5 కేసు గుజరాత్ లో నమోదయింది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు గుజరాత్ లో 3, మహారాష్ట్రలో 2, కర్ణాటక, రాజస్థాన్, తెలంగాణలలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఈ వేరియంట్ తో చైనా, యూఎస్ ఏ లో కేసుల సంఖ్య పెరుగుతుంది. ఒమిక్రాన్ BQ.1తో పోల్చితే ఈ వేరియంట్ 120 రెట్లు వేగంగా వ్యాపి చెందుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
కొత్త కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో, కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 60 యాక్టివ్ కేసులున్నాయి. అయితే ఈ వేరియంట్ కు భయపడాల్సిన పని లేదని, 99.5 శాతం రికవరీ రేట్ ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మరికొన్ని రాష్ట్రాల్లోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబలేటరీలు కోవిడ్ శాంపిల్స్‌ను పరిశీలిస్తున్నాయి.
కొత్త వేరియంట్లు ఏమైనా వ్యాప్తి చెందుతున్నాయోమోనని శాంపిల్స్ ను టెస్ట్ చేస్తున్నారు. చైనాలో కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు శాంపిల్స్ ను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.